మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం

రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది.  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన మునుగోడు ఉపఎన్నికపై  మూడు పార్టీలు స్పెషల్ ఫోకస్‌ పెట్టాయి. క్యాండిడెట్ ఎంపిక నుంచి ప్రచారం వరకు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.  టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరపాటు మళ్లీ రిపీట్ కాకుండా చూస్తోంది. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది.  అటు కాంగ్రెస్ కూడా మునుగోడు ఉపఎన్నికపై  స్పెషల్ ఫోకస్ పెట్టింది.

పార్టీ నుంచి టికెట్ అశీస్తున్న వారితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చానా..... అందరు కలిసి పనిచేయాలని కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు నేతలు. సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కు రానున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. సాయంత్రం జరిగే భేటీలో ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు. భేటీలో మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు, మాజీ మంత్రి రాంరెడ్డి  దామోదర్ రెడ్డి సహా పలువురు సీనియర్లు పాల్గొననున్నారు.