అభ్యర్థుల ఖర్చులను నమోదు చేయాలి : సంజీబ్​ కుమార్​ పాల్​

  •     ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్​ కుమార్​ పాల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్​ కుమార్​ పాల్​ అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఎక్సైజ్​ ఇన్​కం ట్యాక్స్​, ఎన్నికల ప్రవర్తనా నియామవళి నోడల్​ఆఫీసర్లతో కలెక్టరేట్​లో శనివారం సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు

 సమావేశాలన్నింటిని వీడియో సర్వే లైన్స్​ టీం సభ్యులు రికార్డ్​ చేయాలని ఆయన చెప్పారు. వీడియో పరిశీంచి వివరాలను అకౌంటింగ్​​ సభ్యులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఒకరు పర్మిషన్​ తీసుకున్న వెహికల్​ను వేరు అభ్యర్థి ఉపయోగించరాదన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలన నోడల్​ అధికారులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, ఆఫీసర్లు రుక్మిణి, జానయ్య, సింధు పాల్గొన్నారు.