అల్ట్రా-ప్రాసెస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక క్షీణత తీవ్రంగా తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. భారతదేశానికి చెందిన 30 వేలమందిపై మెగా గ్లోబల్ అధ్యయనం పరిశోధన నిర్వహించి... పలు కీలక విషయాలను వెల్లడించింది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువగా తీసుకున్న వారి కంటే ఎక్కువగా తీసుకున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైంటిస్టులు పరిశోధనల ద్వారా గుర్తించారు.
అనారోగ్యం బారిన పడే వారు దాదాపు మూడు రేట్లు ఎక్కువగా ఉంటుందట. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతి స్పందనలను విశ్లేషించారు పరిశోధకులు. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ కోసం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. ఈ రంగం 2011 నుంచి 2021 మధ్య కాలంలో రిటైల్ అమ్మకాలలో 13.37 శాతం వార్షిక వృద్ధి రేటుతో వృద్ది చెందందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. వచ్చే దశాబ్ద కాలంలో జీడీపీ వృద్ధి, అవసరమైన ఆహార పదార్థాల వినియోగం రెండింటి కంటే వేగంగా వృద్ధి చెందతాయని అంచనా వేస్తోంది.
గతంలో చేసిన అధ్యయనాలు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులువంటి ఆరోగ్య పరిస్థితులతో అల్ట్రా-ప్రాసెస్ ఫుడ్( యూపీఎఫ్)లను అనుసంధానించాయి. ప్రస్తుత అధ్యయనం 26 దేశాలలో విస్తరించింది. ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల డిప్రెషన్‌కు మించిన మానసిక పనితీరు క్షీణించడం కొనసాగుతుందని సైంటిస్టులు గుర్తించారు. ప్రత్యేకించి ఆలోచన, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాలను కోల్పోతారని నిపుణుడు త్యాగరాజన్ చెప్పారు. ముఖ్యంగా 18-, 24 సంవత్సరాల వయసు గల యువకులలో వారు 45, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతి రోజు అలాంటి ఆహారం తీసుకునే అవకాశం రెండు రేట్లు ఎక్కువ అని చెప్పారు.