- హెచ్‌సీఏ ఏజీఎంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నడుం బిగించింది. ఇందుకు ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన 86వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఏజీఎం హైదరాబాద్, రంగారెడ్డి మినహా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది.
ఇందుకు డిస్ట్రిక్ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు శాటిలైట్ అకాడమీలు, ఉప్పల్ స్టేడియంలో బోర్డింగ్ సదుపాయంతో ఎక్స్‌లెన్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 57 క్లబ్‌లపై సస్పెన్షన్ ఎత్తివేతతో పాటు, బీసీసీఐ సమావేశాలకు హెచ్‌సీఏ ప్రతినిధిగా ప్రెసిడెంట్ జగన్, సెక్రటరీ దేవ్‌రాజ్ రొటేషన్ పద్ధతిలో హాజరయ్యేందుకు ఏజీఎం ఆమోదం తెలిపింది.