
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం వద్ద మినీ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ తో సహా 13 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం రామన్నపేట ఏరియా ఆసుపత్రి తీసుకెళ్లారు.
ప్రయాణికులు సిద్దిపేట జిల్లాకు చెందిన వారు. సిద్దిపేట నుండి ఏపీలోని అరకు టూర్ కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.