భారతీయ పండుగల్లో భక్తితో పాటు కళాత్మకతకు కూడా సముచిత స్థానం ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి పండుగలో కళాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పండుగ రోజు ప్రతిష్టింపజేసే గణనాధుని విగ్రహాలు, మండపాలు ఇందుకు నిదర్శనం.. భక్తికి, కళాత్మకతకు తనదైన సృజనాత్మకత జోడించి అద్భుతాన్ని సృష్టించాడు ఓ సూక్ష్మ కళాకారుడు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత గుర్రం దయాకర్ అద్భుతాన్ని సృష్టించాడు.
ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో గణపతి నవరాత్రుల సందర్భంగా ఆ గణనాధుని తయారు చేసే దయాకర్.. ఈసారి గరికపోచపై వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేసి తన భక్తిని, ట్యాలెంట్ ను చాటుకున్నాడు. ప్రపంచంలో ఇదివరకు ఎవరు తయారు చేయనిది ఆ గణనాధుని కృప కటాక్షం నా పైన ఉండడం వల్లనే ఇలాంటి ఆలోచన వచ్చిందని అన్నాడు దయాకర్.
గరకపోస పైన గణపతి విగ్రహం
— ravi (@risingsun143) September 7, 2024
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు Guinness world record గ్రహీత గుర్రం దయాకర్ చేసిన అద్భుత సృష్టి pic.twitter.com/3UJmQkEfpI
వజ్ర వైడూర్యాలు మనీ మాణిక్యాల అన్నిటికన్నా ఇష్టమైనది ఆ గణనాధునికి ఆ గరకపోస అలాంటి గరకపోసపై గణనాధుని విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.ఈ విగ్రహం తయారు చేయడానికి ఒక గరకపోస మైనం వాటర్ కలర్స్ వాడినని, తయారీకి 10 గంటల సమయం పట్టిందిని తెలిపారు దయాకర్. దయాకర్ సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.