
- ఫస్ట్ ఫ్లోర్ స్టీమ్ బాత్ రూమ్‌లో షార్ట్ సర్య్కూట్‌తో మంటలు
- ఆర్పి వేసిన హోటల్, ఫైర్ సేఫ్టీ సిబ్బంది
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ లోని పార్క్‌హయత్ హోటల్లో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లో ఉన్నవారు కాసేపు ఆందోళనకు గురయ్యారు. నిర్వాహకులు బిల్డింగ్ఫస్ట్ఫ్లోర్లోని ఓ గదిని స్టీమ్‌బాత్‌కు కేటాయించగా, అందులో కర్రను ఎక్కువగా వాడారు. సోమవారం ఉదయం 10 గంటలకు స్టీమ్‌బాత్ గదిలో షార్ట్సర్క్యూట్కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. గుర్తించిన హోటల్సిబ్బంది ఫైర్‌సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌సేఫ్టీ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదే హోటల్లో సన్‌రైజర్స్ టీమ్
ఐపీఎల్మ్యాచ్కోసం సిటీకి వస్తున్న సన్రైజర్స్హైదరాబాద్ప్లేయర్స్పార్క్హయత్హోటల్ లోనే బస చేస్తున్నారు. 5, 6 ఫ్లోర్లలో ఉంటున్నారు. ఈ నెల 12 జరిగిన ఉప్పల్మ్యాచ్కోసం వచ్చి పార్క్‌హయత్ ఉండిపోయారు. షెడ్యూల్‌ప్రకారం సోమవారం ఉదయం ఫైర్యాక్సిడెంట్జరగక ముందే కొందరు హెటల్ను వెకేట్చేసి ఎయిర్‌పోర్టుకు స్టార్ట్అయ్యారు. మరికొందరు ప్రమాదం జరిగిన తర్వాత బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తర్వాత మ్యాచ్‌కోసం ముంబై వెళ్లారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, పొగ ఎక్కువ ఉండడంతో ఫైర్స్టాఫ్సకాలంలో స్పందించి క్లియర్చేశారని జిల్లా ఫైర్ఆఫీసర్వెంకన్న తెలిపారు.