వికారాబాద్ జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం

వికారాబాద్ జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం

వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు దోమ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు మైనర్లు ఉన్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరూ మైనర్లు కావడంతో పోలీసులు వివరాలు వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.