మద్యం తాగకు అన్నందుకు ఉరేసుకున్న మైనర్

మద్యం తాగకు అన్నందుకు ఉరేసుకున్న మైనర్

​వికారాబాద్, వెలుగు: మద్యం తాగొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో  వేప చెట్టుకు  బాలుడు ఉరేసుకున్నాడు.   ఎస్​ఐ గిరి  వివరాల ప్రకారం..  యాలాల మండలంలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన   వడ్డే భీముడు (17 )గత కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడ్డాడు.

దీంతో  తల్లిదండ్రులు మందలించారు. సోమవారం  సాయంత్రం  భీముడు తాగి రావడంతో తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు.  రాత్రి అయినా ఇంటికి రాలేదు.  సోమవారం    గ్రామ సమీపంలోని  పొలంలో   చెట్టుకు ఉరివేసుకొని కనిపించగా..  గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెలిపారు.  తండ్రి వెంకటయ్య ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు   ఎస్​ఐ తెలిపారు.