అంతరిక్షంలో శాస్త్రవేత్తలకు ఒక కొత్త గ్రహం కనిపించింది. అయితే ఈ గ్రహం సౌరకుటుంబం బయట ఉంది. అరిజోనా విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ పరిశోధనా బృందంతో పాటు NASA జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ని ఉపయోగించి చూశారు. సౌరకుటుంబం బయట వారికి ఓ కొత్త గ్రహం కనిపించింది. ఆ ప్లానెట్ వాతావరణ పరిస్థితుల గురించి ఎక్సోప్లానెట్ WASP-107b సంచలన విషయాలను వెల్లడించింది.
వేడిగా, ఉబ్బినట్లు ఉన్న ఆ గ్రహం బృహస్పతి(జూపిటర్)ని పోలి ఉందని సైంటిస్టులు అంటున్నారు. కానీ.. దాని అది జూపిటర్ ప్లానెట్ ద్రవ్యరాశిలో 10వ వంతు మాత్రమే ఉంది. అంతేకాదు ఆ గ్రహం తూర్పు పడమరలో వ్యత్యాసాలు ఉన్నాయని ఎక్సోప్లానెట్‌ల అధ్యయనంలో తేలింది. ఆ గ్రహానికి ముందు ఓ నక్షత్రం ఉండి వెలుతురుగా ఉంది. మిగతా సగభాగం చీకటి కమ్ముకుంది.
ALSO READ | 2026 నాటికి మార్స్ పైకి మనుషులని పంపేందుకు : ఎలన్ మస్క్ ప్లాన్
యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా స్టీవార్డ్ అబ్జర్వేటరీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి మాథ్యూ మర్ఫీ నేతృత్వంలోని ఈ అధ్యయనం నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించబడింది. WASP-107b టైడల్లీ లాక్ చేయబడింది. అంటే గ్రహం ఒక వైపు నక్షత్రాన్ని శాశ్వతంగా ఉంటుంది. మరొకటి శాశ్వత చీకటిలో ఉంటుంది. దాదాపు భూగ్రహంలో కూడా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. అయితే ఆ గ్రహం నిలకడగా ఉందా.. పరిభ్రమిస్తూ ఉందా అనే విషయం తెలియదు.