అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, కుశాలిని, రోహిణి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Also Read : ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణలు చెప్పాలె : దూలం శ్రీనివాస్
ముఖ్య అతిథి దిల్ రాజు మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడిలో విషయం ఉందని అర్థమైంది. తన మేకింగ్, టేకింగ్ బాగుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.
ఈ సినిమా తన కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోతుందన్నాడు అభయ్ నవీన్. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండేలా ఉంటుందన్నాడు అన్వేష్ మైఖేల్. కొత్త ప్రపంచాన్ని చూస్తారని, డిఫరెంట్ మూవీ చూసిన ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.