రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హైదర్ గూడలో ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యా యత్నం చేసింది. భోజనంలో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తినిపించి తాను తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు తల్లి, ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదర్ గూడకు చెందిన కవిత తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య యత్నం చేసింది. భోజనంలో ఎలుకల మందు కలిపి ఇద్దరు పిల్లలతో పాటు తాను తిన్నది. భర్త వీడియో కాల్ చేసి తాను పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఫోన్ పెట్టేసి ఇంటి పక్కవారికి సమాచారం ఇచ్చాడు. ఇంటికి వచ్చి పొరుగు వారి సాయంతో డోర్లు పగలగొట్టి కవిత, ఆమె ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.