కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇదేనేమో.. ఇల్లు గడిచేందుకు చంటిబిడ్డతో కలిసి ఓ తల్లి పడుతున్న పాట్లను ‘వెలుగు’ క్లిక్‌మనిపించింది. ఆటోలో పుచ్చకాయలు అమ్ముతూ... అదే ఆటోలో పై భాగంలో చీరనే ఊయలగా కట్టి బిడ్డను నిద్రపుచ్చింది.
ఓ వైపు బిడ్డను చూసుకుంటూ.. మరోవైపు గల్లీలన్నీ తిరుగుతూ పుచ్చకాయలు అమ్మే పనిలో నిమగ్నమైంది ఆ తల్లి..
- ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు