తాగిన మైకంలో కన్నబిడ్డనే చంపేసింది

మద్యం ఓ పసివాడి ప్రాణం తీసింది. తాగిన మైకంలో కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం రామన్నగూడలో జరిగింది. పరమేశ్వరీ అనే మహిళ ఫుల్ గా  కల్లు తాగి వచ్చి ఆ మైకంలో రాత్రి తన కొడుకు ధనుష్ ను గొంతునులిమి చంపేసింది. మద్యం తాగవద్దని బంధువులు హెచ్చరిచినందుకు ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడింది. ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు పోలీసులకు ఈ విషయం తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లాడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

see more news

ట్రెండింగ్.. రైతులకు మద్దతుగా పోర్న్‌స్టార్..

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు