కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ లోని HP పెట్రోల్ బంక్ లో మోసం జరుగుతున్నట్లు ఓ వాహనదారుడు గుర్తించాడు. వరంగల్ రోడ్డులో ఉన్న HP పెట్రోల్ బంకుకు వెళ్లిన ఓ వాహనదారుడు..150 రూపాయలు ఇచ్చి పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే.. 150 రూపాయలకు సరిపడా పెట్రోల్ పోయకపోవడంతో అనుమానంతో బంకు సిబ్బందిని నిలదీశాడు వాహనదారుడు. పెట్రోల్ ను బాటిల్ లో పోయించుకుంటే తక్కువగా వచ్చినట్లు గుర్తించాడు. బంకు సిబ్బంది రీడింగ్ లో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
150 రూపాయలకు సరిపడా పెట్రోల్ ను మళ్లీ పోస్తామని చెప్పారని, రీడింగ్ లో జరిగిన మోసాన్ని ఇంతటితో వదిలేయమని తనను బంకు సిబ్బంది వేడుకున్నారని బాధిత వాహనదారుడు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. రీడింగ్ లో తప్పు జరిగిందని పెట్రోల్ బంకులో పని చేసే ఓ వ్యక్తి ఒప్పుకున్నారని బాధిత వ్యక్తి చెప్పాడు.