
కాశీబుగ్గ, వెలుగు: సిటీలోని కీవి స్కూల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నోరూరించింది. స్కూల్ ప్రిన్సిపాల్ దాసి సతీశ్ మూర్తి, డైరెక్టర్ దాసి రజిని మాట్లాడుతూ సుమారుగా 150 వివిధ రకాల ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి దగ్గరే పేరెంట్స్ సహకారంతో తయారు చేశారని చెప్పారు. కల్తీ ఆహారాలు, జంక్ ఫుడ్ తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. అందుకే ఇంటి ఆహారంపై అవగాహన కల్పిస్తూ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రవీణ్ కుమార్, రవితేజ, రంజిత, జోష్న, స్రవంతి, మంజుల, 200ల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.