
పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించారు కన్నడ నటుడు దేవరాజ్. ఆయన కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బుధవారం ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘దేవరాజ్ నట వారసుడిగా ప్రణం ఈ రంగంలోకి రావడం సంతోషంగా ఉంది. తనకు ఇది మూడో చిత్రం. పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’ అని కోరారు. ‘చక్కని లవ్ స్టోరీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్ ఇది’ అని చెప్పాడు హీరో ప్రణం. ‘జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ జరుగుతుంది’ అని దర్శకనిర్మాతలు తెలిపారు. నటుడు దేవరాజ్, రవి శివతేజతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.