హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్‌: సిటీలో ట్రాఫిక్, వెహికల్ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పార్కింగ్ స్థలాల కొరతను తీర్చేందుకు రద్దీ ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్క్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని రూ.3కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్లు, బైక్ లు పార్కింగ్ చేయడానికి ఈ సదుపాయం కల్పిస్తున్నారు. 72 కార్ స్పేస్‌లను, మొత్తం స్థలంలో 20 శాతం బెక్ పార్కింగ్ కోసం ఈ ప్రాజెక్ట్ కేటాయించారు. 

ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మల్టీ లెవల్ పార్కింగ్ తెరిచి ఉంచుతారు. పార్కింగ్ చేసే దగ్గర సీసీ కెమెరాలు, లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కూడా ఇలాంటి మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనుంది.10 అంతస్తుల బిల్డింగ్ లో ఐదు బిసినెస్ యాక్టివిటీస్ కు, మరో ఐదు మల్టీ లెవల్ పార్కింగ్, షాపింగ్ మాల్స్ కు కేటాయించనున్నారు.