కారు ఢీకొని మున్సిపల్ స్వీపర్ మృతి

కారు ఢీకొని మున్సిపల్ స్వీపర్ మృతి

కూకట్పల్లి, వెలుగు: బైక్పై డ్యూటీకి వెళ్తున్న మున్సిపల్ స్వీపర్ను కారు ఢీకొనడంతో మృతి చెందాడు. జగద్గిరిగుట్టకు చెందిన సుధాకర్​(30) కూకట్పల్లి మున్సిపల్ ఆఫీస్లో స్వీపర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్పై డ్యూటీకి వెళ్తుండగా, ఐడీఎల్ చెరువు రోడ్డుపై అతణ్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. స్థానికులు గమనించి బాధితుడిని సమీప హాస్పిటల్​కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కూకట్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.