Bangladesh cricket: హత్య కేసులో ఇరుక్కున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, అవామీ లీగ్ మాజీ శాసనసభ్యుడు షకీబ్ అల్ హసన్‌పై అడాబోర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది.  ఢాకాలో అతనిపై హత్య కేసు నమోదు చేయడంతో పెద్ద చిక్కుల్లో పడ్డాడని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్‌ను హత్య చేయాలని ఆదేశించినట్లు షకీబ్ పై ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తండ్రి రఫీకుల్ ఇస్లాం గురువారం (ఆగస్టు 22) చేసిన ఫిర్యాదులో షకీబ్ పేరు కూడా ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా, రోడ్డు రవాణా, వంతెనల శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్ సహా 156 మంది నిందితులుగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 400-500 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారట.  ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 5 న అడాబోర్‌ రింగ్ రోడ్‌లో నిరసన ప్రదర్శనలో రూబెల్ పాల్గొన్నాడు. ర్యాలీ సమయంలో ఎవరో ఒక ప్రణాళికా బద్ధంగా గుంపుపైకి కాల్పులు జరిపారని.. దీని ఫలితంగా రూబెల్ ఛాతీ,  పొత్తికడుపులో అతన్ని కొట్టారని ఆరోపించారు.

ALSO READ | Rohit Sharma-Ritika Sajdeh: జూ. హిట్ మ్యాన్ కమింగ్.. తండ్రి కాబోతున్న రోహిత్ శర్మ!

అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆగస్టు 7న మృతి చెందాడు. ప్రస్తుతం షకీబ్ పాకిస్థాన్ లో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ లో అత్యంత పాపులర్ క్రికెటర్లలో షకీబ్ ఒకడు. బంగ్లాదేశ్ తరపున 68 టెస్టులు, 247 వన్డేలు, 129 టీ20 మ్యాచ్ లాడిన అనుభవం ఉంది.