
- గజ్వేల్లో నామినేషన్
- దాఖలు చేసిన పద్మరాజన్
గజ్వేల్ / మఠంపల్లి, వెలుగు: గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై తమిళనాడు వాసి పోటీ చేస్తున్నాడు. ఈ మేరకు ఆయన శుక్రవారం నామినేషన్కూడా దాఖలు చేశారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన కె.పద్మరాజన్ దేశంలో ఇప్పటి వరకు 237 సార్లు పలువురు ప్రధానులు, రాష్ట్రపతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు..తదితర ప్రముఖులపై బరిలోకి దిగి నామినేషన్ వేసి ఓడిపోయారు. ఇలా ఎన్నికల్లో ఎక్కువసార్లు ఓడిన వ్యక్తిగా ఆయన గిన్నిస్ రికార్డ్ కొట్టారు. అందుకే ఆయనను తమిళనాడులో ‘ఎలక్షన్ కింగ్’ అని పిలుస్తారు. ఈసారి కేసీఆర్పై పోటీ చేయాలనుకున్న పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
మఠంపల్లి వాసి కూడా..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన సపవట్ సుమన్ నాయక్ కూడా సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గజ్వేల్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. గుర్రంపోడు తండా ప్రజలకు, గిరిజనులకు కేసీఆర్ఏమీ చేయలేదని, అందుకు నిరసనగా కేసీఆర్ ను ఓడించేందుకు నామినేషన్ వేసినట్లు సుమన్ నాయక్ తెలిపారు. సుమన్ గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా, ఓయూలో మలిదశ ఉద్యమకారుడిగా పనిచేశాడు.