నేపాల్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసోసియేట్ దేశమైనా, స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు. నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు. సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లు ఎక్కి మ్యాచ్ లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో అంతకు ముంచి అనేలా ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ చూపించిన పిచ్చి అభిమానం వైరల్ గా మారింది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 17) నేపాల్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో తడబడింది. 5.2 ఓవర్లలో 30 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ తౌహిద్ హ్రిదోయ్ వికెట్ ను కెప్టెన్ రోహిత్ పౌడెల్ అవుట్ చేయడంతో నేపాల్ అభిమాని ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు. పాడెల్ ఒక వికెట్ తీయగానే.. ఆ అభిమాని నేపాల్ దేశ జెండాను పట్టుకుని పూల్‌లోకి దూకి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే మ్యాచ్ లో నేపాల్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
నెదర్లాండ్స్ పై జరిగిన మ్యాచ్ లో నేపాలీ షర్టులు ధరించి స్టాండ్స్ లో సందడి చేశారు. ఇక స్టేడియానికి రాలేకపోయిన ఫ్యాన్స్ కు ఆ దేశంలో స్పెషల్ స్క్రీన్స్ వేయడం విశేషం. ఈ స్క్రీన్ దగ్గర మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇసుకేస్తే రాలనంత జనం మ్యాచ్ చూస్తూ కనిపించారు. క్రికెట్ లో పసికూనగా భావించే నేపాల్ దేశంలో క్రికెట్ పై ఇంత అభిమానం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.
Nepal 🇳🇵 fan jumps into stadium's swimming pool to celebrate wicket during Bangladesh 🇧🇩 match
— TOI Sports (@toisports) June 17, 2024
WATCH 📽️ https://t.co/OqqpiL5z66#NEPvBAN #BANvNEP #T20WorldCup