హైదరాబాద్ : జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ నేపాల్ దేశస్తుడు తప్పిపోయాడు. ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నేపాల్ దేశానికి చెందిన కమల్ సునర్ (25) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఉద్యోగం కోసం కోఠి ఇసామియా బజార్ లోని అతని సోదరుడు గోపాల్ సునర్ ఇంటికి వచ్చాడు. ఉద్యోగం వెతుక్కొనేందుకు జులై19వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన కమల్ సునర్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని సోదరుడు గోపాల్ అన్ని చోట్ల వెతికాడు. తెలిసిన వాళ్లను వాకబు చేశాడు. అయినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపాల్ సునర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.