హైదరాబాద్లో పాకిస్తానీ అరెస్టులో కొత్తకోణం..

హైదరాబాద్ లో పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి అరెస్టులో కొత్తకోణం బయటపడింది. ప్రేయసి కోసం నేపాల్ మీదుగా వీసా లేకుండా హైదరాబాద్ వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విషయం తొమ్మిది నెలల తర్వాత బయటపడింది.

కిషన్ బాగ్ లోని ప్రేయసి ఇంట్లో ఉన్న మహమ్మద్ ఫాయాజ్ తో పాటు అతని అత్త మామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రేయసి తల్లిదండ్రులు మహమ్మద్ ఫాయాజ్ కు ఆధార్ కార్డు సృష్టించారు. ప్రస్తుతం ఫాయాజ్ మామ షేక్ జుబేర్, అత్త అఫ్జల్ బేగం పరారీలో ఉన్నారు. ఫయాజ్ పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. అరెస్ట్ చేశారు.