- 13 మంది ఎమ్మెల్యేలకు ఛాన్స్
- కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు
- జూన్ 20న విదేశీ పర్యటనకు సీఎం నవీన్ పట్నాయక్
- రోమ్, దుబాయ్‌ను సందర్శించనున్న నవీన్ పట్నాయక్
- జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు
భువనేశ్వర్ : ఒడిశాలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. బిజు జనతా దళ్ నేతలు జగన్నాథ్ సరక, నిరంజన్ పూజారి సహా 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా గవర్నర్ గణేశీ లాల్.. భువనేశ్వర్‌లోని లోక్‌సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం (జూన్ 5న) సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమీళా మల్లిక్, ఉషా దేవి, తుకుని సాహును సీఎం నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మంత్రివర్గంలోని అందరనీ రాజీనామా చేయాలని శనివారం (జూన్ 4న) సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 20 మంది రాజీనామాలు సమర్పించగా.. కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమమైంది.
Odisha Cabinet Reshuffle: The 13 cabinet ministers & 8 ministers with independent charge that took oath today have been allotted the following departments of the state govt. pic.twitter.com/19uqt6mhOd
— ANI (@ANI) June 5, 2022
శనివారం (జూన్ 4న) తన పదవికి రాజీనామా చేసిన అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో మంత్రివర్గంలో చేరడం లేదని తెలుస్తోంది. పాత్రో మంత్రివర్గంలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. వాటిని ఆయన కుమారుడు బిప్లవ్ తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలతోనే తన తండ్రి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. శనివారం మంత్రి పదవికి రాజీనామా చేసిన బీకే అరుఖా స్పీకర్ పదవిని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గాన్ని మార్చినట్లు తెలుస్తోంది.
Odisha Cabinet reshuffle: 21 ministers, including 5 women, take oath
— ANI Digital (@ani_digital) June 5, 2022
Read @ANI Story |https://t.co/TPjY6nX6tP#OdishaCabinetReshuffle #OdishaCabinet pic.twitter.com/mqINPN90Ej
జూన్ 20వ తేదీన సీఎం నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రోమ్, దుబాయ్‌ను సందర్శించనున్నారు. జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గాన్ని మార్చాలని సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం మే 29తో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రావడం ఇది వరుసగా ఐదోసారి కావడం విశేషం.
Odisha | In a cabinet reshuffle, swearing-in ceremony of 21 ministers- 13 cabinet & 8 ministers with independent charge underway at Convention Centre in Lok Seva Bhawan, Bhubaneswar in the presence of CM Naveen Patnaik pic.twitter.com/ininLcU3wA
— ANI (@ANI) June 5, 2022
మరిన్ని వార్తల కోసం..
మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్