టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ జిల్లా కొత్త కమిటీల ఎన్నిక

టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ జిల్లా కొత్త కమిటీల ఎన్నిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్​(టీజీటీఏ)జిల్లా కొత్త కమిటీ శుక్రవారం ఎన్నికైంది. కొత్తగూడెంలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు.  టీజీటీఏ స్టేట్​ ప్రెసిడెంట్​ ఎస్​. రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్​ అసోసియేషన్​ జనరల్​ సెక్రటరీ వి. బిక్షం కమిటీ వివరాలను మీడియాకు వెల్లడించారు.

టీజీటీఏ జిల్లా ప్రెసిడెంట్​గా కె. రవి కుమార్​, జనరల్​ సెక్రటరీగా మామిడి అశోక్​ కుమార్​, అసోసియేట్​ ప్రెసిడెంట్లుగా ఇమ్మానియోల్​, ముజాహిద్, వైస్​ ప్రెసిడెంట్లుగా బి. గన్యా నాయక్​, కె. రాజారావు, నాగ భవాని, ఆర్గనైజింగ్​ సెక్రటరీలుగా నరేశ్, నాగ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా సంధ్యారాణి, ట్రెజరీగా వి. రాఘవరెడ్డి, అడ్వైజరీ బోర్డు ప్రతినిధులుగా పి. కృష్ణప్రసాద్​, ఎం. శ్రీనివాస్, ఈసీ మెంబర్లుగా శకుంతల, స్వాతిబిందును ఎన్నుకున్నట్టు తెలిపారు. 

టీజీఆర్​ఎస్ఏ కొత్త కమిటీ..

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్​ అసోసియేషన్​(టీజీఆర్​ఎస్​ఏ) జిల్లా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రెసిడెంట్​గా బాదావత్​ బద్రు, జనరల్​ సెక్రటరీగా గుండు రాజులు, మహిళా అధ్యక్షురాలిగా ఎల్. ప్రసన్న, ట్రెజరర్​గా అపక రమేశ్, అసోసియేట్​ ప్రెసిడెంట్​గా ఎం. రాజేశ్వరరావు, బి. లక్ష్మణ్, వైస్​ ప్రెసిడెంట్లుగా తిరుమల, కల్లూరి వెంకటేశ్వర్లు

పి. కృష్ణ ప్రసాద్, కోట్ల నరేశ్, బి. నాగేశ్వరరావు, సెక్రటరీలుగా కె.బాలకృష్ణ, డి.గోపి, జాయింట్​ సెక్రటరీగా పసుపులేటి నరసింహరావు, బి. సుమతి, తేజావత్​ వెంకన్న, ఆర్గనైజింగ్​ సెక్రటరీలుగా పి. సమ్మయ్య, తారాచంద్, పి. కామేశ్వరరావు, ఊకె. ముత్తయ్య, పద్దం అరుణకుమారి, బి.సురేశ్,  కె. వీరన్నను  ఎన్నుకున్నారు.