గూగుల్ క్రోమ్‌లో సరికొత్త ఫీచర్ వచ్చింది. దాని పేరు ‘లిజన్ టు దిస్ పేజ్’. ఏదైనా సమాచారం కోసం వెబ్ పేజీలో బ్రౌజ్ చేస్తే.. అందులో టెక్స్ట్ రూపంలో ఉన్న కంటెంట్‌ను ఈ ఫీచర్ చదివి వినిపిస్తుంది. స్క్రీన్ లాక్‌లో ఉన్నా ఆడియో వినొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేసియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఎలా వాడాలంటే...
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత చూడాలనుకున్న పేజీని ఓపెన్ చేయాలి. పేజీ పూర్తిగా లోడ్ అయ్యాక, కుడివైపు పైన కనిపించే మూడు చుక్కల మీద ట్యాప్ చేయాలి. అందులో కనిపించే మెనులో ‘లిజన్ టు దిస్ పేజ్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంతో కంటెంట్ చదవడం మొదలవుతుంది. మినీ ప్లేయర్‌పై క్లిక్ చేస్తే ప్లేబ్యాక్ స్పీడ్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. వాయిస్ ఆప్షన్‌ను క్లిక్ చేసి నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.