
శాన్ఫ్రాన్సిస్కో: వాట్సాప్‌లో మెసేజ్‌లు వెతికేందుకు కొత్త ఫీచర్ రానుంది. పాత చాట్‌ను వెతకాలంటే స్క్రోలింగ్ చేయాల్సిన పనిలేకుండా నెల, తేదీ, సంత్సరం ఆధారంగా క్షణాల్లో కనిపెట్టొచ్చు. ఇందుకోసం ‘సెర్చ్ మెసేజ్ బై డేట్’ అనే ఆప్షన్‌ను సంస్థ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ వాడాలంటే చాట్స్ వెతకటానికి సెర్చ్ బార్‌కి వెళ్లగానే క్యాలెండర్ కనిపిస్తుంది. అందులో మీకు కావల్సిన డేట్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌లు మీకు కనిపిస్తాయి. ఈ ఫీచర్ వల్ల పాత చాట్స్‌ను సులభంగా వెతికేయొచ్చు. ప్రస్తుతం వాట్సప్ వెబ్ బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.