న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో కొత్త చరిత్ర మొదలైంది. ఇప్పటివరకు మెన్స్ మాత్రమే అంపైర్లుగా వ్యవహరించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలోకి ఇప్పుడు విమెన్ అంపైర్లు కూడా వచ్చేశారు. మంగళవారం మొదలైన కొన్ని మ్యాచ్ల్లో వ్రిందా రాథీ, జననీ నారాయణన్, గాయత్రి వేణుగోపాలన్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.
దీంతో రంజీల్లో అంపైరింగ్ నిర్వహించిన మహిళా అంపైర్లుగా ఈ త్రయం రికార్డులకెక్కింది. జార్ఖండ్–ఛత్తీస్గఢ్ మ్యాచ్కు గాయత్రి, రైల్వేస్–త్రిపుర మ్యాచ్కు జననీ, గోవా–పుదుచ్చేరి మ్యాచ్కు వ్రిందా అంపైర్లుగా వ్యవహరించారు.