ఆపిల్ క్రెడిట్ కార్డు వచ్చేసింది

ఆపిల్ క్రెడిట్ కార్డు వచ్చేసింది

ఆపిల్.. ఈ పేరు తెలియని వారుండరమే.సాఫ్ట్‌ వేర్ నుంచి హార్డ్‌ వేర్ దాకా ప్రతి వ్యాపారాల్లో ఆపిల్ ఉంది. తాజాగా సర్వీసుల రంగంలోకి వచ్చేసింది. రావడమేమిటి..? ఏకంగా క్రెడిట్ కార్డుల సిస్టమ్‌ నే మార్చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌‌లో ఉన్నక్రెడిట్ కార్డులను రీప్లేస్ చేసేలా.. సరికొత్త క్రెడిట్ కార్డును కాలిఫోర్నియాలోని కూపర్టినోలో ప్రకటించింది. దాని పేరు ‘ఆపిల్ కార్డు’. కస్టమర్లకు ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితాన్ని అందించాలనే లక్ష్యంగా ఆపిల్ కార్డును తీసుకొచ్చినట్టు ప్రకటించింది. అయితే ఈ కార్డు బేసిక్‌ గా వర్చ్యువల్ క్రెడిట్ కార్డు. 2014లో లాంచ్ చేసిన ఆపిల్ పే మొబైల్ వాలెట్యాప్‌ లోనే ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఆపిల్ పే కు అతిపెద్ద అప్‌ డేట్‌‌గా క్రెడిట్ కార్డు సిస్టమ్‌ ను జతచేసింది. ఐఫోన్ నుంచే ఈ కార్డును కస్టమర్లు వాడు-కోవాలి. రిటైల్ స్టోర్లు , ఆన్‌‌లైన్‌‌ స్టోర్లు లేదా యాప్స్నుంచి ఏదైనా వస్తువు కొనుగోలు చేసి.. చెల్లింపులు చేయడానికి ఆపిల్ పేను వాడే సమయంలో డిఫాల్ట్  పేమెంట్ విధానంగా ఇది పనిచేస్తుంది.

ఆపిల్ కార్డు వివరాలు మీ ఐఫోన్ సెక్యూర్ ఎలిమెంట్‌‌లో స్టోర్ అయి ఉంటాయి. ఇది ఆపిల్ పే వాడే స్పెషల్సెక్యురిటీ చిప్. ప్రతి లావాదేవీ కూడా యూజర్స్ ఫేస్ఐడీ లేదా టచ్ ఐడీ అథెంటికేషన్‌‌, వన్‌‌ టైమ్ యునిక్డైనమిక్ సెక్యురిటీ కోడ్‌ తోనే జరుగుతుంది. మీరుఎక్కడ, ఎంత షాపింగ్ చేశారు అనే వివరాలను తాము యాక్సస్ చేయమని ఆపిల్ ప్రకటించింది.అంటే థర్డ్ పార్టీలు మీ షాపింగ్ వివరాలను, ఆన్‌‌లైన్ కొనుగోళ్లను ట్రాక్ చేయరన్నమాట. క్రెడిట్ కార్డు అనుభవాన్ని పూర్తిగా ఇది సులభతరం చేస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్‌‌ నుంచి, ఫీజులు లేకపోవడం, తక్కువ వడ్డీ రేటుకే చెల్లింపులు చేసేలా కస్టమర్లను ప్రోత్సహించడం, గోప్యత, భద్రతలో సరికొత్త స్థాయిని ఆపిల్ కార్డు ద్వారా అందించనుంది.

అయితే ఈ ఆపిల్ కార్డు ప్రస్తుతం అమెరికాప్రజలకేనట. ఈ వేసవి నుంచి అమెరికా ప్రజలు ఆపిల్ సరికొత్త కార్డు సేవలను పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాక ఆపిల్ కార్డు సరికొత్త రివార్డ్స్ ప్రొగ్రామ్‌ ను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ కార్డుకు కార్డు నెంబర్, ఎక్స్‌‌పైరీ డేట్, సీవీవీ నెంబర్‌‌‌‌ వంటి వివరాలు అవసరం లేదు. దీంతో ఒకవేళ కార్డును ఎవరైనా దొంగిలించి.. వీటిని దుర్వినియోగ పరుస్తారనే భయం కూడా అవసరం లేదు. ‘ఆపిల్ పే విపరీతమైన విజయం సాధించడంతో ఆపిల్ కార్డును రూపొందించాం. ఆపిల్ కార్డు ద్వారా సరికొత్తషాపింగ్ అనుభవాన్ని అందిస్తాం’ అని ఆపిల్ పే వైస్‌‌ ప్రెసిడెంట్ జెన్ని ఫర్ బైల్లీ చెప్పారు.

న్యూస్ సబ్‌ స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఆపిల్…

ఆపిల్‌‌ కార్డుతో పాటు న్యూస్ సబ్‌ స్క్రిప్షన్ సర్వీసులను ఆపిల్ లాంచ్ చేసింది. నెలకు10 డాలర్లకు(రూ.688.52కు) ఈ సబ్‌ స్క్రి-ప్షన్ సర్వీసులను పొందవచ్చు. వందల కొద్దీమ్యాగజైన్లు, న్యూస్‌‌పేపర్ల యాక్సస్‌‌ను ఇది ఆఫర్ చేస్తుంది. 300కు పైగా మ్యాగజైన్ల నుంచి ఆర్టికల్స్‌‌ను , డిజిటల్ సైట్లు, న్యూస్‌‌పేపర్ల నుంచి కథనాలను పాఠకులు చదువుకోవచ్చు. హ్యుమన్ ఎడిటర్లు యాప్ కోసం స్టోరీ లను ఎంపిక చేస్తారు. ప్రజల ప్రైవసీని తాము కాపాడతామని ఆపిల్ చెప్పిం ది. ఒరిజినల్ వీడియో కంటెంట్‌‌ను అందించడం కోసం ఆపిల్ టీవీ ప్లస్‌‌ను కూడా లాంచ్ చేసింది. దీనికోసం 34టీవీ, మూవీ ప్రొడక్షన్ కంపెనీల-తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆపిల్ టీవీయాప్‌ ను సరికొత్త డిజైన్‌‌తో తీసుకొచ్చింది.