ములుగు, వెలుగు: దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అమర్చడం వల్ల కొత్త జీవితం ప్రారంభమవుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షుడు బాబుగౌడ్ అన్నారు. ఆదివారం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సహకారంతో వికారాబాద్ లో ములుగు మండలంలోని గోపమ్మ, నర్సింలు, శంకర్, వెంకటేశ్, మైసయ్యలకు కృత్రిమ కాళ్లను బిగించారు.
ఈ సందర్భంగా బాబుగౌడ్ మాట్లాడుతూ.. రోటరీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే ముగ్గురు వికలాంగులకు కృత్రిమ చేతులను అమర్చామని తెలిపారు. ఆయనతోపాటు క్లబ్ కార్యదర్శి నరసింహారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు