నరేన్, పాయల్ జంటగా కొత్త సినిమా.. పక్కా యూత్‌‌ఫుల్

నరేన్, పాయల్ జంటగా కొత్త సినిమా.. పక్కా యూత్‌‌ఫుల్

‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ నరేన్ వనపర్తి హీరోగా,  మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. పాయల్ గుప్తా హీరోయిన్.  నటుడు జయ ప్రకాష్ రెడ్డి కూతురు మల్లిక  నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారభమైంది. దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు.

ఇదొక యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్ అని చెప్పాడు నరేన్. ‘ఆగస్టు నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నాం. 70శాతం తెలంగాణ , ఆంధ్రాలో..  మిగతాది కేరళలో షూట్ చేస్తాం’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.