విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా పరుశురామ్(Parasuram) డైరెక్షన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). విజయ్ కి జోడీగా మృణాల్ థాకూర్ ( Mrunal Thakur) నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు(Dil raju) గ్రాండ్గా నిర్మిస్తున్నారు.
దీపావళి సందర్భంగా ఫ్యామిలీ స్టార్ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ పోస్టర్లో..విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్ ట్రేడషనల్ లుక్లో ఆకట్టుకుంటున్నారు. ఈ బ్యూటీఫుల్ జోడీ దీపావళి పండుగ జరుపుకుంటున్నట్లుగా..చిచ్చుబుడ్డి వెలిగిస్తున్న ఫోటోను షేర్ చేయడంతో..దేవరకొండ ఫ్యాన్స్..అన్న మస్తుంది పోస్టర్..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే త్వరలో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ కూడా రాబోతుంది.
From our family to yours, Happy Diwali.
— Sri Venkateswara Creations (@SVC_official) November 12, 2023
To extend the festivities beyond this holiday season, first single of #FamilyStar is coming very soon.@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/X2j3esalli
రీసెంట్గా రిలీజ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టీజర్ ఆడియన్స్ను భలే అట్ట్రాక్ట్ చేసింది. ఈ మూవీలో మధ్య తరగతి కుర్రాడిగా విజయ్ దేవరకొండ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ టీజర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఉల్లిపాయలు కొంటె ఆడు మనిషి కాదా..పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా..అనే డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.