ఆ రూ.252 కోట్ల అప్పు వల్లేనా.. సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్యలో ట్విస్ట్

ప్రముఖ కళా దర్శకులు నితిన్ చంద్రకాంత్ దేశాయ్(Nithin chandrakanth deshai)(57) బుధవారం అకస్మాత్తుగా చనిపోయిన విషయం తెలిసిందే. రాయగడ కర్జాన్ లోని సొంత స్టూడియోలో విగతజీవిగా కనిపించారు నితిన్ చంద్రకాంత్. ఈ ఘటనను  ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు.. ఆ కోవలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులు ఫైనల్‌గా ఏం తెలుసుకున్నారు అనేది ఇప్పడు ఉత్కంఠగా మారింది. 

నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కు సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని. ఆ కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే నిజానికి నితిన్  చంద్రకాంత్ తీసుకున్న లోన్ రూ. 180 కోట్లు మాత్రమే కానీ.. వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీంతో ఆ సంస్థ నితిన్‌ ఎన్‌డీ స్టూడియోని సీజ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయిన నితిన్ చంద్రకాంత్ ఆ స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు.

ALSO READ:నేషనల్ అవార్డ్ ఆర్ట్‌ డైరెక్టర్‌ సూసైడ్?

ఇక నితిన్ చంద్రకాంత్ పనిచేసిన సినిమాలు ఆయన సాధించిన అవార్డుల విషయానికి వస్తే.. లగాన్, హమ్ దిల్ దే చుకే సనమ్, అంబేద్కర్, దేవదాస్ వంటి సినిమాలతో నాలుగుసార్లు జాతీయ అవార్డ్స్ అందుకున్నారు నితిన్. అంతటి ఘనత సాధించిన నితిన్ చంద్రకాంత్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.