భవనాల కూల్చివేతకు సరికొత్త వాహనం

భవనాల కూల్చివేతకు సరికొత్త వాహనం

జీడిమెట్ల, వెలుగు: అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు దెబ్బతిని ప్రమాదకరంగా ఉన్న భవనాలను సురక్షితంగా కూల్చేందుకు వొల్వో సరికొత్త వాహనాన్ని రూపొందించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా తయారు చేసిన ఈ వాహనాన్ని (వొల్వో సీఈఈసీ 3800డీఎల్) కంపెనీ నిర్వాహకులు జీడిమెట్లలోని యునైటెడ్​ సా సర్వీసెస్​(యూ.ఎస్.​ఎస్) సంస్థకు ​గురువారం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల భవనాన్ని సైతం కూల్చడంలో  వోల్వో ఎక్విప్​మెంట్​ప్రత్యేక పాత్ర వహిస్తుందన్నారు. కూల్చివేతల సమయంలో పర్వావరణంపై తక్కువ ప్రభావన్ని చూపిస్తూ దుమ్ము, శబ్ధం తక్కువ వచ్చే విధంగా ఈ వాహనాన్ని రెడీ చేశామన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు వినోద్​కుమార్​, మోహన్​ రామనాథన్​, జాకీ అహ్మద్​, కృష్ణన్​  పాల్గొన్నారు.