భద్రాచలం, వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఆదివారం నూతన ఆర్జిత సేవను ఈవో రమాదేవి ప్రారంభించారు. నిత్య కల్యాణమూర్తులతో పాటు చిన్న గరుడ వాహనంతో ఈ సేవను రూ.250ల టికెట్‌పై నిర్వహించనున్నారు. గరుడ వాహనంపై స్వామిని ఉంచి నిర్వహించే ఈ సేవకు భక్తులు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ నేపథ్యంలో వారి కోరిక మేరకు కొత్తగా ఈ సేవను ప్రారంభించినట్లుగా ఈవో రమాదేవి తెలిపారు.
భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. కాగా ఉదయం గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. భక్తులకు స్వామి అభిషేక జలాలు, మంజీరా (పసుపు ముద్ద)లు పంపిణీ చేశారు.