
పాట్నా: బిహార్‌లో కొత్తగా నిర్మించిన ఓ క్లాక్ టవర్ ప్రారంభించిన మర్నాడే పాడైపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.40 లక్షలతో ఈ క్లాక్ టవర్‌ను నిర్మించారు. సీఎం ప్రగతి యాత్ర సందర్భంగా ప్రారంభోత్సవం చేయనుండటంతో క్లాక్ టవర్‌ను హడావుడిగా పని చేయించారు. అయితే, మరుసటి రోజే దొంగలు టవర్‌లోకి ప్రవేశించి రాగి తీగలను ఎత్తుకెళ్లడంతో అది పనిచేయకుండా పోయింది. దీంతో నెటిజన్లు బిహార్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఈ అద్భుత నిర్మాణానికి కేవలం 40 లక్షలు.. హ్యాట్సాఫ్’ అని ఎక్స్‌లో ఓ యూజర్ పేర్కొన్నారు.