భోపాల్: కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ సీఎం కు, అక్కడ ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న నర్స్ ఒకరు రాఖీ కట్టారు. సోమవారం రక్షాబంధన్ పండుగ సందర్భంగా సరోజ్ అనే నర్స్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాఖీ కట్టి ఆయన వైరస్ నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్- 19 నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. మాస్క్, పీపీఈ కిట్ ధరించి రాఖీ కట్టి, మిఠాయిలు పంచారు. ఆ తర్వాత సీఎం ఆమెను దీవించారు.
జులై 25 న సీఎం శివరాజ్ సింగ్ కు కోవిడ్ -19 పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతోగత కొన్నిరోజులుగా ఆయన భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.
Madhya Pradesh: Saroj, a nurse ties rakhi to Chief Minister Shivraj Singh Chouhan at a hospital in Bhopal.
Saroj is deployed at the ward in which Shivraj Singh Chouhan is admitted. He had tested positive for #COVID19 on July 25. #RakshaBandhan2020 pic.twitter.com/lzlx2fx1bv
— ANI (@ANI) August 3, 2020