గురవారం సాయంత్రం ఢిల్లీలో విషాద ఘటన చేటుచేసుకుంది. నార్త్ ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో దయాళ్ పూర్ మార్కెట్ లో పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు జరిగి తర్వాత ఫ్యాక్టరీ మొత్తం మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 11మంది చనిపోయినట్ల ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. సాయంత్ర 5 గంటలకు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికుల నుంచి సమాచారం అందిందని దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నామన్నారు. 150 మంది ఫైర్ సిబ్బంది నాలుగు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదానికి గల కారణాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీకి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. మంటలకు చుట్టు పక్కల ఇళ్ల గోడలు దగ్ధమైయాయి. ఫ్యాక్టరీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు స్టార్ట్ అయినట్లు ఫైర్ పోలీసులు తెలిపారు. బిల్డింగ్ కు ఒకే దారి మెట్లతో ఉందని ఆ మార్గంలో మంటలు విపరీతంగా ఉండటంతో ఎవరూ బయటకు రాలేకపోయారు. నలుగురు గాయపడగా వారిని హాస్పిటల్లో చేర్పించారు.