మెట్రో డోర్లో ఇరుక్కున్న ప్యాసింజర్! సెన్సార్​ పని చేయకపోవడంతో ఘటన

మెట్రో డోర్లో ఇరుక్కున్న ప్యాసింజర్! సెన్సార్​ పని చేయకపోవడంతో ఘటన

హైదరాబాద్ సిటీ, వెలుగు: అధికారుల నిర్వహణా లోపం, టెక్నికల్ ​సమస్యల కారణంగా శనివారం ఓ ప్రయాణికుడు మెట్రో రైలు డోర్​లో ఇరుక్కుపోయాడు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించడంతో సేఫ్​గా బయటపడ్డాడు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్​లో ఓ ప్రయాణికుడు రైలు దిగుతుండగా డోర్లు కోజ్​ అయ్యాయి. 

సెన్సార్​పనిచేయకపోడంతో డోర్ల మధ్య అతను ఇరుక్కుపోయాడు. తోటి ప్రయాణికులు అప్రమత్తమై లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే మెట్రోలో తరచూ టెక్నికల్​సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బేగంపేట రూట్​లో మెట్రో రైలు నిలిచిపోయింది. ఆ ఎఫెక్ట్​తో మూడు కారిడార్లపై పడి, రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.