ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యమాడిన నెమలి

ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యమాడిన నెమలి

జగిత్యాల: ఎవరైన అమ్మాయి అందంగా నాట్యం చేస్తే... నెమలి నాట్యం  చేసినట్లుందని పొగుడుతుంటారు. మరీ అలాంటిది ఓ నెమలే పురి విప్పి నాట్యం చేస్తే... ఆ దృశ్యాన్ని వర్ణించగలమా? నిజం చెప్పాలంటే వర్ణించడం కష్టమే. ఎందుకంటే నెమలి నాట్యం చేయడం చూస్తే... ప్రకృతిలో ఇంతకు మించిన దృశ్యం ఉంటుందా అని అనిపించకమానదు.

ఇక విషయానికి వస్తే... జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని భీమారం గ్రామంలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో ఓ నెమలి పురి విప్పి నాట్యం చేసింది. కొండ రాతిపై ఉన్న నెమలి... పింఛం విప్పి, చుట్టూ తిరుగుతూ  నాట్యం చేసింది. ఈ సీన్ ని స్థానికులు కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అంటున్నారు.