లక్నో : యూపీలో దారుణం జరిగింది. మద్యానికి బానిస అయ్యావని.. రీహబిలిటేషన్ సెంటర్ వెళ్లాలని చెప్పినందుకు కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు ఓ వ్యక్తి. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సీతాపూర్ జిల్లాలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట తల్లి సావిత్రిని(65) కాల్చి చంపిన అనురాగ్(42).. భార్య ప్రియాంకను(40) సుత్తెతో కొట్టి హతమార్చాడు.
తర్వాత తన ముగ్గురు పిల్లలు అశ్విని (12), ఆర్నా (9), అద్విక్ (6)లను ఇంటిపై నుంచి తోసేసి చంపేశాడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. అనురాగ్ మద్యం, డ్రగ్స్ కి బానిసై నిత్యం కుటుంబ సభ్యులతో గొడవరపడేవాడని పోలీసులు తెలిపారు.