వికారాబాద్, వెలుగు: మద్యం మత్తులో నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కోటమర్పల్లి గ్రామానికి చెందిన చాకలి రాములు(49) గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్సమీపంలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.
బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మర్పల్లి ఎస్ఐ సురేశ్ తెలిపారు.