పాపం.. మియాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలా జరిగిందేంటి..?

పాపం.. మియాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలా జరిగిందేంటి..?
  • కరెంట్ షాక్తో  మూడో అంతస్తుపై నుంచి పడి వ్యక్తి మృతి

మియాపూర్, వెలుగు: మియాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మయూరినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మూడో అంతస్తులో కరెంట్ షాక్ తగలడంతో కిందపడి క్రేన్ ఆపరేటర్ చనిపోయాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా తరిగొప్పుల మండలం అంక్షాపూర్​ గ్రామానికి చెందిన శివరాత్రి యాదగిరి(45) భార్య రజిత, నలుగురు పిల్లలతో కలిసి జగద్గిరిగుట్టకు వలస వచ్చాడు. కన్​స్ర్టక్షన్​ బిల్డింగ్​లో లిఫ్టింగ్​ క్రేన్​ బిజినెస్ చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం మియాపూర్​ మయూరినగర్​లోని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్​లో క్రేన్​తో మెటీరియల్​ లిఫ్టింగ్​ పనికి ఒప్పుకున్నాడు. సోమవారం మంచిరోజు కావడంతో భార్యతో కలిసి బిల్డింగ్​ వద్దకు పనులు చేసేందుకు వచ్చాడు.

బిల్డింగ్​ మూడో ఫ్లోర్​లో క్రేన్​తో మెటీరియల్​ లిఫ్ట్​ చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కరెంట్​ షాక్​ తగిలి గ్రౌండ్​ ఫ్లోర్​లోని ఇటుకలపై పడి స్పాట్​లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు బిల్డింగ్​ వద్దకు చేరుకొని న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మృతుడి కుమారుడు ఇచ్చిన కంప్లైంట్​ మేరకు మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తన కండ్ల ముందే భర్త కరెంట్ షాక్ తో చనిపోవడంతో భార్య రోధించిన తీరు కంటతడి పెట్టించింది.