డ్రంకెన్​ డ్రైవ్​లో దొరికిన : ఒకరికి మూడురోజుల జైలు

కరీంనగర్ క్రైం, వెలుగు : మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష పడింది. డ్రంకెన్​ డ్రైవ్​లో దొరికిన 9 మందిని ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పర్స రమేశ్​ బుధవారం మున్సిఫ్​ కోర్టు మెజిస్ట్రేట్ సరళరేఖ ముందు హాజరుపరిచారు. సిద్ధిపేట జిల్లా ప్రశాంత్ నగర్ కు చెందిన అటి సోమేశ్వర్ (25) కు మూడు రోజుల జైలు శిక్ష రూ. 2 వేలు జరిమానా విధించగా.. మిగతా ఎనిమిది మందికి కలిపి రూ. 11వేలు జరిమానా విధించారు.