పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు

 పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది.   పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పిడుగు పడింది.  వేములవాడ మున్సిపల్  పరిధిలోని శాత్రాజుపల్లిలో ఈ ఘటన చోటుచేసుుకుంది.  పొలం వద్ద ఉన్న చింత చెట్టు దగ్గరికి  చింతకాయ తెప్పేందుకు వెళ్లారు  కంబాల శ్రీనివాస్, కొమురవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాసులు. ఈ క్రమంలో  పిడుగుపడింది.  కంబాల శ్రీనివాస్ (32) సమీపంలో  పిడుగు పడటంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.  మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి.  వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

అటు తంగళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ చెందిన రుద్రారపు చంద్రయ్య(50) అనే రైతుపై పొలం వద్ద పిడుగు పడింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.  మరోవైపు  సిరిసిల్ల పట్టణంలో భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురిస్తుంది.   మెయిన్ రోడ్డు, పాత బస్టాండ్, లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.   వాహన దారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది.