గల్ఫ్​ నుంచి వీడియో కాల్ ​మాట్లాడుతూ ఉరేసుకున్నడు

గంభీరావుపేట, వెలుగు:  బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లిన  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం  నర్మాల గ్రామానికి చెందిన  ఓ వ్యక్తి వీడియోకాల్​మాట్లాడుతూ ఉరేసుకున్నాడు. నర్మాల గ్రామానికి చెందిన గరిగంటి నర్సింహులు(40)  20 ఏండ్ల కింద బహ్రెయిన్​వెళ్లాడు. గ్రామంలోని భూవివాదం నేపథ్యంలో గురువారం కుటుంబసభ్యులతో వీడియో కాల్​ మాట్లాడుతూ ఉరేసుకున్నాడు. 

ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్‌గా మారింది. నర్సింహులుకు  భార్య రాధ, ముగ్గురు కొడుకులున్నారు.