- విద్యుత్ షాక్తో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
- ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో ప్రమాదం
ఇబ్రహీంపట్నం, వెలుగు: కరెంట్ పోల్ ఎక్కి రిపేర్ చేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అయి షాక్ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద రామావత్ హరి(30), అంబోత్ మోహన్ పని చేస్తున్నారు. గురువారం విద్యుత్ పోల్ పై పనులు చేస్తుండగా కరెంట్ సరఫరా అయి షాక్ కొట్టడడంతో హరి స్పాట్లో చనిపోయాడు.
మోహన్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మృతుడు హరి, గాయపడ్డ మోహన్ సొంతూరు మంచాల మండలంలోని చెన్నారెడ్డి గూడ. కాంట్రాక్టర్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే హరి చనిపోయాడని.. తమకు న్యాయం చేయాలని ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులు, బంధువులు నిరసనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.