పెద్దపల్లి జిల్లాలో చలి మంట అంటుకుని వ్యక్తి మృతి

ధర్మారం, వెలుగు : చలి మంట కాగుతుండగా మంటలు అంటుకుని ఒకరు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గత నెల 30న బొల్లి లచ్చయ్య తన ఇంటి ముందు చలి మంట కాగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన లుంగికి మంటలు అంటుకుని రెండు కాళ్లు కాలిపోయాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని కరీంనగర్  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

మెరుగైన వైద్యం కోసం వరంగల్  ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ లచ్చయ్య బుధవారం రాత్రి మరణించాడు. ఆయన  కొడుకు  బొల్లి కుమార్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధర్మారం ఎస్సై సత్యనారాయణ తెలిపారు.