
మెదక్(చేగుంట), వెలుగు: ఆన్లైన్గేమ్స్ తో అప్పుల పాలై ఓ వ్యక్తి రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న సంఘటన ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వడ్యారం గ్రామానికి చెందిన కౌడి నరేశ్(33) అప్పులు చేసి ఆన్లైన్గేమ్స్ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వడియారం రైల్వే స్టేషన్ నుంచి మాసాయిపేట్ రైల్వే స్టేషన్ మధ్యలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.